బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఆగస్టు 26,27 తేదీల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయిన పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలావుండగా ఇప్పటికే విశాఖ ఆర్కే బీచ్, రుషికొండ తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి.