ఆల్పూజ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం రాత్రి నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది. ఈగల్ టీం బాపట్ల నుండి చీరాల వరకు ఈ రైల్లో తనిఖీలు చేసుకుంటూ రాగా జహంగీర్ అనే ప్రయాణికుడి వద్ద మూడు ప్యాకెట్లను కట్టి ఉన్న నాలుగు కిలోల గంజాయి దొరికింది.దీంతో అతడిని చీరాల స్టేషన్ లో దింపేసి రైల్వే పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై కొండయ్య తెలిపారు.నిందితుడు కేరళకు చెందిన వాడని చెప్పారు.కేసు దర్యాప్తులో ఉంది.