అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని అరవకూరు, ముద్దలాపురం గ్రామాల్లోని రహదారులను డ్రామా పీడీ సలీం భాష మరియు అడిషనల్ పీడీ సుధాకర్ రెడ్డిలు మండల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ నందు మ్యాజిక్ డ్రైన్ నిర్మాణమును పైలెట్ ప్రాజెక్టు క్రింద చేపట్టుటకు గాను పలు గ్రామాల రహదారుల పరిశీలనలో భాగంగా అరవకూరు ముద్దులాపురం గ్రామాల్లోని రహదారులను పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టే నిర్మాణ పనులు ఆదర్శప్రాయంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.