కామారెడ్డి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద GST స్లాబ్ లను తగ్గించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు,ఆహార పదార్థాల పై 18%, 12% ఉన్న పన్నును 5%, 0% శాతానికి భారీగా పన్ను రేట్లు తగ్గించి సాధారణ ప్రజలపై పన్ను భారాన్ని పడకుండా చూశారని, ఇన్సూరెన్స్ కి GST నీ ఎత్తివేయటం ద్వారా అందరికీ భీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా చూశారని, అలాగే అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా GST తగ్గించడం వల్ల ధరలో ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నార