ఒంటిమిట్టలో పౌర్ణమి సందర్భంగా శ్రీ కోదండరాముడి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఇందులో భాగంగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు.