వికారాబాద్ జిల్లా ధరూర్ మండల పరిధిలోని అంతారం గేటు వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహన దారునికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వికారాబాద్ నుంచి అంతారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం స్ప్లెండర్ బైక్ ఢీకొనడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు.