అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల ప్రొవిజనల్ లిస్టును విడుదల చేశామని అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వరనాయుడు శుక్రవారం రాత్రి తెలిపారు. అయితే ప్రొవిజనల్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు 6291549387, 7267301248 నెంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. అభ్యర్థులు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఆశాకార్యకర్తల పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తున్నామన్నారు.