జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. మున్సిపాలిటీ పరిధిలోని నల్తూర్, కొడకంచి, ఊట్ల, శివనగర్, దాది గూడెం, జంగంపేట, మంగంపేట తదితర గ్రామాలలో మోస్తారు వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమం మారాయి. వర్షపు నీరుతో రోడ్డు బురదమయంగా మారింది. వర్షంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.