మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం 12:00 లకు చేయూత పింఛన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెంచిన పింఛన్ అందించాలంటే నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మెరకు పింఛన్దారులకు పెంచిన ఆసరా పెన్షన్ను తక్షణమే అందించాలంటూ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.