రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలోని మల్కాపేట రిజర్వాయర్ లోకి మిడ్ మానేరు నుండి నీటిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో మంగళవారం అధికారులు విడుదల చేశారు.నీరు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వనికి,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి రైతులు ప్రజలు ధన్యవాదాలు చెబుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు విడుదల చేసి జలాశయంలోకి చేరుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తున్నారు.