పలమనేరు: డివిజనల్ పోలీసు కార్యాలయ వర్గాలు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తెలిపిన సమాచారం మేరకు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలమనేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన డిఎస్పి డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు మరియు రాష్ట్ర రోకలు నిర్వహించకూడదు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పది పోలీస్స్టేషన్లో సెక్షన్ 30 పోలీస్ శాఖ అమలులో ఉంటుంది దీనిని అతిక్రమిస్తే ఎవరినైనా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందన్నారు.