కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం మొదలైన శోభాయాత్ర శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న వినాయకులను అంగరంగ అలంకరించి వైభవంగా ప్రత్యేక వాహనాల్లో నిమజ్జనానికి తరలిస్తున్నారు. శోభాయాత్ర రాత్రి 10 ,11 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ఉన్న గణేశులను, శోభాయాత్రను తిలకించడానికి పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున కామారెడ్డి కి చేరుకున్నారు. శోభాయాత్రను త్వరగా ముగించేలా పోలీసులు ప్రయత్నం, పట్టణం నుంచి శోభాయాత్రగా బయకుదేరిన వినాయకులను టేక్రియాల్ చెరువులో నిమజ్జనం చేస్తున్నారు.