జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషనరావుపేట్ గ్రామ బస్టాప్కు సమీపంలో రాష్ట్ర రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్లోలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాహనదారులు నియంత్రిత వేగంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పోలీసులు కోరుతున్నారు.