శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువుల అందక ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏమి చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం నందిగాం మండలం సొంటినూరులో పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా అచ్చెన్నాయుడు వ్యవరిస్తున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల అంచనా వేయడంలో విఫలమయ్యా రన్నారు.