కామారెడ్డి : జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అన్ని మతాల పెద్దలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. గురువారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాస్థాయి పీస్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ వినాయక చవితి అతి పెద్ద ఉత్సవం అని వినాయక చవితి ఉత్సవంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అందరు సహకరించి విజయవంతం చేయాలని అన్నారు.