కడప నగరంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో విద్యార్థులకు మౌళిక సమస్యలను,వర్షపు నీటి సమస్యను పరిష్కరించాలని ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి, యువజన సంఘం (పిఆర్ఎస్ వైఎఫ్) ఆధ్వర్యంలో ఐటిఐ కళాశాలలో చేరిన వర్షపు నీటిని గురువారం నాడు పరిశీలించారు...ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో చిన్నపాటి వర్షం వచ్చిన కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోతుందని తద్వారా అక్కడ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక సంవత్సరాలు నుంచి అక్కడ వర్షం వస్తే నీరు నిల్వ ఉంటున్నా, ఆ సమస్యకు పరిస్కార మార్గం చూపకుండా ప్రిన్స