మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల స్టాక్ యార్డ్ లో ఉన్న ఇసుకను టి.జి.ఎం.డి.సి. సాండ్ బజార్ కు తరలించేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లోని కలెక్టర్ కార్యాలం లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేలాల స్టాక్ యార్డులో ఉన్న 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను టి.జి.ఎం.డి.సి. సాండ్ బజార్ కు కేటాయించడం కొరకు సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఇసుక బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు.