నారాయణపేట జిల్లాలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులలో 21వ శతాబ్దపు నైపుణ్యాలను, సైన్స్, డిజిటల్, ఆర్థిక అంశాలను పెంపొందించేందుకు ఒక ఎన్ జీ ఓ మరియు సీ ఎస్ ఆర్ మద్దతుతో పాఠశాలల్లో మార్పుకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ ఎన్జీఓలను అభినందిస్తూ, పూర్తి మద్దతుకు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు. అనంతరం, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రతినిధులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముడుమాల్ గ్రామ మెగాలిథిక్ మెన్హిర్ సైట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.