మధిరల మండలం చిన్ననేమిల క్రాస్ రోడ్ వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా డీజే వాహనంపై పట్టా కప్పుతుండగా నిమ్మరబోయిన జీవన్ (15) పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.