యాదాద్రి భువనగిరి జిల్లాలోని భారీ వర్షానికి వలిగొండ భువనగిరి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వలిగొండ భువనగిరి ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద భారీ ఎత్తున వర్ధనిరుపారుతుండడంతో బుధవారం రాకపోకలు నిలిచిపోయాయి .దీంతో చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీసులు రెవిన్యూ యంత్రాంగం అప్రమత్తమై రాకపోకలను మళ్లించారు. వలిగొండ మండలంలోని నాగారం వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి నాగారం నుంచి చౌటుప్పల్ మీదుగా దారి మళ్లించారు.