అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం 12 గంటల 35 నిమిషాల సమయంలో అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ఎస్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కలెక్టరేట్ వద్ద ఎంఆర్పిఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మార్పీఎస్ దళిత సంఘాలు అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ చేయాలని అలా చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు తెలిపారు.