వెలిగండ్ల: గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ కమిటీల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని సూచించారు. శనివారం సాయంత్రం వెలిగండ్లలో జరుగుతున్న గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఎస్ఐ కృష్ణ పావని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో ఆమె మాట్లాడుతూ... నిమజ్జనోత్సవం సందర్భంగా చిన్న పిల్లలు, వృద్ధులను చెరువులు కుంటల వద్దకు తీసుకుని వెళ్ళద్దని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు.