సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి భార్య పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. మక్తల్ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే CMRF చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి భార్య వాకిటి లలిత పంపిణీ చేశారు. అంతకు ముందు కూడా లలిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో దీనిపై విమర్శలు వస్తున్నాయి. మంత్రి భార్య అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.