కర్నూలు లో ఉల్లి రైతులు రోడ్డు ఎక్కారు. ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్నూలు వ్యవసాయ మార్కెట్ ఎదుట ఉల్లిని రోడ్డు పై వేసి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన 1,200 రూపాయలు కొనుగోలు చేయకుండా తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేస్తున్నారని ఉల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి రైతులు చేస్తున్న ఆందోళనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులు మద్దతు ఇచ్చి ఆందోళన లో పాల్గోన్నారు. ఉల్లికి కనీసం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.