అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డిని రాష్ట్ర మాజీ మంత్రులు మర్యాద పూర్వకంగా కలిశారు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాడిపత్రి పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహానికి మాజీ మంత్రులు ఎన్.అమర్నాథ్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, మాణిక్యలరావు, టిడిపి ఎమ్మెల్యేలు అరమిల్లి రాధాకృష్ణ, ఏలూరు సాంబశివరావులు మంగళవారం స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు అనంతపురం నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం, అదే విధంగా రాజకీయాలు, తాడిపత్రిలో చోటుచేసుకున్న పరిణామాలను వారు చర్చించుకున్నారు