రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికుడు శ్రీనివాసులు (36) గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి అంబేడ్కర్ నగర్ మెలకల్మూరు రోడ్డులో వినాయక నిమజ్జన ఊరేగింపు చూసేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మున్సిపాలిటీలో 14 ఏళ్లపాటు సేవలందించాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు, పలువురు కౌన్సిలర్లు సోమవారం ఉదయం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.