అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వద్ద కర్ణాటక సరిహద్దు చెక్పోస్టులో అఖిల కర్ణాటక ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులను ఆదివారం అనంతపురం రాకుండా ఏపీ పోలీసులు అడ్డగించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై కర్ణాటక ఎన్టీఆర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు తో పాటు మరో 60 మంది సభ్యులు చలో అనంతపురం చేపట్టారు. దగ్గుపాటి క్షమాపణ చెప్పాలని ఉద్దేశంతో తాము శాంతియుత కార్యక్రమం చేపట్టామన్నారు. అయితే పోలీసులు అనంతపురం వెళ్లకుండా విడపనకల్లు పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు.