సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి. అనురాధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని, పరిశుభ్రత, పచ్చదనము, ఆహ్లాదకరమైన వాతావరణము గురించి మొక్కలు చాలా ముఖ్యమని అందులో భాగంగా కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి (600) మొక్కలు నాటడం జరిగిందన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.