అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెలుగుప్ప వజ్రకరూరు విడపనకల్లు ఉరవకొండ, కూడేరు మండలాల పరిధిలోని గ్రామాల్లో వాడ వాడలా వినాయక చవితి వేడుకలను ఘనంగా శోభాయ మానంగా నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం నుండి వినాయక దేవాలయాలు మందిరాలు వివిధ మండపాల్లో పంచామృత అభిషేకాలు వ్రత పూజలను, శమంతకమణి పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో వెండి కవచ శ్రీ విఘ్నేశ్వర స్వామి శోభాయమానంగా చెవితి వేడుకల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.