జామి మండలం చింతాడ గ్రామంలో పాము కాటు కు గురై విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కె సన్యాసిరావు అనే వృద్ధుడు మృతి చెందాడని, అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జామి పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. వృద్ధుడు సన్యాసిరావు సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం పొలంలో గాబు తీస్తుండగా పాము కాటు వేయడంతో కుటుంబీకులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వృద్ధుడు సన్యాసిరావు ఆదివారం మృతి చెందాడు.