నర్సాపూర్ హత్నూర మండలాల్లోని ఆయా గ్రామాల్లో శనివారం ఘనంగా శ్రీ గణేశుల నిమజ్జన శోభాయాత్ర నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ల మండపాల వద్ద నిర్వహించిన లడ్డు వేలం పాటల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నిమజ్జన శోభాయాత్ర వైభవంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి అవంతిని సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.