మద్యం షాపులపై ప్రభుత్వానికి ఉన్నంత ప్రేమ రైతులపై లేదని అందుకే రైతులకు అవసరమైన యూరియా సరఫరాను సక్రమంగా అందించడం లేదని ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మధు అన్నారు. సోమవారం ధర్మవరం ఆర్టీవో కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం అందించడంలో విఫలమైందని వెంటనే యూరియాను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.