వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలోని ఆయన స్వగృహం నందు శ్రీశైలం నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో మాట్లాడుతూ, రైతు సంబర సభ, శ్రీ శక్తి కార్యక్రమం మరియు మార్కెట్ యార్డు సొసైటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం, నిర్వహణపై కార్యకర్తలతో చర్చించారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి ప్రజల అవసరాలు వెంటనే తీర్చాలని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు. బూతు ఇన్చార్జిలు. క్లస్టర్లు పాల్గొన్నారు.