బంగారు కుటుంబాల అర్హులజాబితా తయారీపై శుక్రవారం మధ్యాహ్నంగంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ పీరుబండి హైమావతి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలోనూ గ్రామసభల నిర్వహించి అర్హులైన బంగారు కుటుంబాల జాబితాను పక్కాగా తయారు చేయాలని గ్రామ కార్యదర్శిలకు సూచించారు. సమావేశంలో ఇంచార్జ్ ఎంపీడీవో రాములమ్మ, వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.