ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట వడాలి రహదారిలో బుధవారం ఉదయం 8:30 సమయంలో పాఠశాల విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు పంట పొలాల్లో బోల్తా పడిన ఘటన లో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారికి సురక్షితంగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు సేకరించారు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా పోలీసులకు తెలిపిన వివరణ ప్రకారం బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు