ఎమ్మిగనూరులో ఉల్లి రైతుల ధర్నా..ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఉల్లిపాయ పంటకు కనీస మద్దతు ధర రూ.3 వేలుగా నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని తహశీల్దార్ శేషఫణికి సమర్పించారు. వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మద్దతు ధర కల్పించాలని సంఘ నాయకులు కోరారు.