పలమనేరు: మండల ఎస్సై స్వర్ణ తేజ తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు మండల పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వారందరికీ ముఖ్య సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మండపము గణపతి విగ్రహ ఎత్తు ఏర్పాటు చేసే స్థలము వివరాలను ఎంటర్ చేసి అనుమతులు తీసుకోవాలన్నారు మరియు కీలక వివరాలు తెలిపారు.