సూపర్ సిక్స్ పథకాలు అమలు.. మరోపక్క మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని చూసి వైసీపీ పార్టీకి బుగులు రేగుతుందని, ఆడబిడ్డల ఆశీర్వాదంతో సీఎం చంద్రబాబు మరింత అద్భుతమైన పాలన అందిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు అన్నారు. మాజీ సీఎం జగన్ పిల్లి శాపాలు పెడుతున్నారని, సీఎం చంద్రబాబు వయసు గురించి మాట్లాడడం పై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మండిపడ్డారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు.