చీమకుర్తి పట్టణంలో నిలబడి ఉన్న భారీ గణేష్ విగ్రహం ఖైరతాబాద్ వినాయకుడిని తలపిస్తూ పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ విగ్రహం పట్టణ ప్రధాన రహదారుల గుండా ఊరేగిస్తూ మండపానికి తరలించారు. మండపంలో భారీ గణేష్ విగ్రహాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు ఆసక్తిని చూపారు