శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. ఆదివారం సెలవు దినం కావడం మరోవైపు శ్రీశైల జలాశయామ 8 గేట్లు ఎత్తి ఉండడంతో భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శించుకుని అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి, జల సౌందర్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున శ్రీశైలం తరలి వస్తున్నారు. మరో వైపు భక్తులు క్యూ లైన్ లో కంపార్టుమెంటులో వేచి ఉన్నారు. స్వామి అమ్మవార్లు దర్శనం త్వరగా వచ్చిన పూర్తయినందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.