Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: భారతీయ సరుకులపై అమెరికా సుంకాన్ని 50% పెంచడం వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్నాం సిపిఐ గుంటూరు కార్యదర్శి అజయ్ కుమార్

Guntur, Guntur | Sep 4, 2025
భారతీయ సరుకలపై అమెరికా సుంకాన్ని 50% పెంచడం ఆక్వా, టెక్స్టైల్స్ రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం వల్ల గార్మెంట్ ఫ్యాక్టరీల్లోని వేలాది మంది మహిళా కార్మికులు, రొయ్యల రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 6న నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు విద్యార్థులు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us