ధర్మవరం మండలం పోతుకుంట గొట్లూరు పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై రూరల్ పోలీసులు డ్రోన్ కెమెరాతో కొరడా జులిపించారు. డ్రోన్ కెమెరా రావడంతో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారు పరుగులు అందుకున్నారు. రూరల్ ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో కలిసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగంగా మద్యం సేవిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు..