రైలు కింద పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ వాసి భూక్యా పెంటానాయక్ చర్లపల్లిలోని తన చెల్లి వద్ద ఉంటూ ఐటీ కారిడార్లో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.