కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండల కేంద్రంలో,డి 86 కెనాల్ వద్ద గణేష్ నిమజ్జనం కోసం,చేస్తున్న ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గురువారం 4:10 PM కి పనులను పర్యవేక్షించారు,స్థానిక పోలీస్ మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుని తగిన సూచనలు సలహాలు సూచించారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ,నిమజ్జనం కోసం కెనాల్ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశామని మంచి అనుభవం గల క్రేన్ డ్రైవర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు,అనంతరం చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ,నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తారని తెలిపారు