వరంగల్ ఆయుర్వేద ఆసుపత్రిలో మందుల కొరత పై ప్రత్యేక కథనం ఇక్కడ కనపడుతున్న ఆసుపత్రి వరంగల్ లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఈ దవాఖానలో గత కొద్ది రోజుల నుండి మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు రాసిన మందులు ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో, రోగులు బయట ప్రైవేటు మెడికల్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రోగులు మందుల కోసం భారీగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.