విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో రైల్వే పోలీసులు శుక్రవారం ముమ్మర తనికీలు చేస్తుండగా వెస్ట్ చంపారన్ జిల్లా, బీహార్ రాష్ట్రం కు చెందిన సోను కుమార్ సింగ్,ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి ని వెస్ట్ చంపారన్ జిల్లా, బీహార్ రాష్ట్రం కు అక్రమముగా రవాణా చేయుచుండగా అతనిని అదుపులోకి తీసుకొని, అతని నుండి Rs.49,000/- విలువగల 9.8 కేజీల గంజాయి ని సీజ్ చేసి, సబ్-ఇన్స్పెక్టర్ కె టి ఆర్ లక్ష్మి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు లో హాజరు పరచినట్లు అలాగే సదరు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను వెలికి తీస్తున్నామన్నారు