కలెక్టరేట్ ప్రజా సమస్యల వేదికకు 174 అర్జీలు శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 174 అర్జీలు అందినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇందులో డివిజన్ల వారీగా చూస్తే పుట్టపర్తి- 67, పెనుకొండ - 51, ధర్మవరం - 41, కదిరి- 15 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.