పలమనేరు: పాతపేట గుడియాత్తం రోడ్డు నందు శుక్రవారం రఫీ అనే వృద్ధుడిని చితకబాది ఆయన వద్ద ఉన్న 15000 రూపాయల నగదు మొబైల్ ఫోన్ ను నలుగురు యువకులు లాక్కెల్లారని ఆరోపించిన సంగతి విధితమే. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు, పలమనేరు పాతపేట గవర్నమెంట్ ఆసుపత్రి ముందు వీధిలో ఉన్న అల్తాఫ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం అతను ఇచ్చిన సమాచారం మేరకు, మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో సిఐ మరియు డిఎస్పి ముందు విచారిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు.