రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎరువుల సమస్య లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్ ఆధారంగా సప్లై చేయాలన్నారు. సోమవారం సాయంత్రం పాడేరులోని కలెక్టరేట్ నుంచి ఎరువుల డీలర్లు, వ్యవసాయాధికారులతో వీసీ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు రైతులకు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.