రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనీ విద్యార్థులకు ఉచితంగా ప్రధాని మోదీ కానుకగా సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సైకిల్ పై జాగ్రత్తగా వెళ్లి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సైకిల్స్ తీసుకున్న విద్యార్థులు బండి సంజయ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులతో సైకిల్ పంపిణీ చేసి ఫోటోలు దిగుతూ.. వారి బాగోగులు ఇంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.